సోనీ నుంచి వినూత్నమైన డిజైన్ తో లింక్ బడ్స్

సోనీ ఒక ఆకర్షణీయమైన ఉత్పత్తిని విడుదల చేసింది. ఓపెన్ రింగ్ డిజైన్ తో ఇయర్ బడ్స్ తీసుకొచ్చింది. 12ఎంఎం డ్రైవర్, 360 రియాలిటీ ఆడియో సపోర్ట్, సోనీ ఇంటెగ్రేటెడ్ ప్రాసెసర్ వీ1, డీఎస్ఈఈతో ఉండే ఈ ఇయర్ బడ్స్ అత్యంత నాణ్యమైన ఆడియో అనుభవాన్ని ఇస్తాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 17.5 గంటల పాటు వినియోగించుకోవచ్చని సోనీ ప్రకటించింది.

దీని ధర రూ.19,990. అయితే ముందుగా బుక్ చేసుకుంటే రూ.12,990కే సోనీ ఆఫర్ చేస్తోంది. ఆగస్ట్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సోనీ రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్ సంస్థలు, ఎలక్ట్రానిక్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. బరువు కేవలం 4 గ్రాములే. చెవుల ఆకృతికి తగ్గట్టు దీన్ని మార్చుకోవచ్చు.

Sony
Link buds
launched

More Telugu News